తీసుకున్న రుణాలను.. సకాలంలో చెల్లించాలి

తీసుకున్న రుణాలను.. సకాలంలో చెల్లించాలి

భిక్కనూరు, వెలుగు: వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న లోన్లను రైతులు సకాలం చెల్లించాలని భిక్కనూరు సింగిల్​విండో చైర్మన్ గంగల భూమయ్య పేర్కొన్నారు.

స్థానిక సింగిల్​విండో ఆఫీస్​లో మంగళవారం పాలకవర్గ సమావేశం జరిగింది. భూమయ్మ మాట్లాడుతూ.. స్వల్పకాలిక,దీర్ఘకాలిక రుణాలు తీసుకొని సకాలం చెల్లించని వారికి డిమాండ్​ నోటీసులు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. ఇటీవల మృతిచెందిన పెర్ముల మొగులయ్య,సింగాటపు నారాయణ కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. వైస్​చైర్మన్​ ముచ్చర్ల రాజిరెడ్డి, సభ్యులు పెద్దబచ్చగారి మహిపాల్​రెడ్డి, అంబల్ల మల్లేశం, సజిత్, డప్పు జ్యోతి, సీఈవో నర్సింలు పాల్గొన్నారు.