లింగంపేట, వెలుగు: తాము సాగు చేస్తున్న అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్చేస్తూ బుధవారం నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్, వెంకంపల్లి, లింగంపల్లి, పోచారం, మాల్తుమ్మెద, గోపాల్పేట ఆయా గ్రామాల రైతులు స్థానిక తహసీల్దార్ఆఫీస్ఎదుట ధర్నా చేశారు. మండలంలోని ఆరు వందల మంది రైతులకు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 88 మంది ఎస్టీలకు మాత్రమే ఇటీవల పట్టాలు ఇచ్చారని, ఎస్సీ, బీసీ కులాలకు చెందిన మిగతా రైతులకు కూడా పట్టాలు ఇవ్వాలని కోరారు.
వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఎంపీపీ దివిటి రాజ్దాస్, గడ్డి వెంకని ప్రభాకర్,లింగంపల్లి సర్పంచ్ప్రభాకర్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.