రాష్ట్రంలో కరెంటు కోతలు.. నిరసనగా రోడ్డెక్కిన రైతన్నలు

కరెంటు కోతలకు నిరసనగా సూర్యాపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నూతనకల్ మండలంలో నాలుగు రోజులుగా రోజు నాలుగు గంటల కూడా కరెంటు సరఫరా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ లో ఒక అధికారి కూడా లేకపోవడంతో ఆపరేటర్ ను ప్రశ్నించారు రైతులు. అయితే.. పై నుంచే రావట్లేదన్న ఆపరేటర్ సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దాదాపు 30 నిమిషాల పాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.