పాస్​ బుక్కులు ఇవ్వాలని నిరాహార దీక్షలు

నెల్లికుదురు,(కేసముద్రం) వెలుగు: పోడు భూములకు పట్టాలు ఇస్తున్న ప్రభుత్వం తమ పట్టా భూములకు పాసు బుక్కులు  ఎందుకివ్వడం లేదని గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు రిలే నిరాహర దీక్ష చేపట్టారు.  

ఈ సందర్భంగా ఎంపీటీసీ  ధరావత్ రవి నాయక్​  మాట్లాడుతూ..  ధరణి వచ్చిన తర్వాత తమ గ్రామ పట్టా భూములను రెవెన్యూ ఆఫీసర్ల తప్పిదంతో ఫారెస్ట్ భూములుగా మార్చారని ఆరోపించారు.  గ్రామంలో సాగు భూమి1,827 ఎకరాలు, గ్రామం మొత్తం ఫారెస్ట్​ ఏరియాలోనే  ఉందని పాస్​ బుక్కులు నిలిపి వేశారన్నారు. 

 అనేక పోరాటాలు చేస్తే కలెక్టర్​ రిపోర్ట్​ ఆధారంగా 2022 ఆగస్టులో 500 మందికి చెందిన 700 ఎకరాలు ధరణిలో నమోదు చేశారని,  500 మందికి చెందిన 1,127 ఎకరాల భూమి వివరాలు పొందుపర్చలేదని వాపోయారు. ఇప్పటికైనా తమ భూములను ధరణిలో  చేర్చి పాసు బుక్కులు ఇవ్వాలని కోరారు.