రైతు కష్టం వరద పాలు

  • భారీగా కురిసిన వర్షానికి తడిసిన వడ్లు

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షం అన్నదాతను ఆగం చేసింది. రైతుకష్టం అంతా వరద పాలయ్యింది. ముఖ్యంగా మహబూబాబాద్​జిల్లా మహబూబాబాద్​, నెల్లికుదురు, తొర్రూరు, కురవి, మరిపెడ, బయ్యారం, గార్ల నరసింహులపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్, కాటారం, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో కురిసిన భారీ వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది.  

తొర్రూరు మండలం అమ్మాపురం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం రాశులు నీట మునగగా, కురవి మండలంలో కొనుగోలు సెంటర్​లో పోసిన ధాన్యం రహదారుల వెంట కొట్టుకుపోయింది. పలుచోట్ల తడిసిన ధాన్యం మొలకెత్తడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.