కామారెడ్డిలో పోటీకి రైతుల తీర్మానం : కుంట లింగారెడ్డి

భిక్కనూరు, వెలుగు: రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్​ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెడుతుందని తిప్పాపూర్​ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గ్రామంలో సమావేశమైన రైతులు పార్టీలకు అతీతంగా కామారెడ్డిలో  కేసీఆర్​పై పోటీగా వంద నామినేషన్లు వేయాలని తీర్మానించుకున్నట్లు చెప్పారు. ధరణి పోర్టల్​ వచ్చిన తర్వాత రైతుల అవసరాల కోసం భూములు అమ్ముకోడానికి వీలు లేకుండా పోతుందన్నారు. ఈ నెల 6న గ్రామ రైతులందరూ కలిసి ట్రాక్టర్లపై వెళ్లి నామినేషన్లు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్​కిసాన్​సెల్​జిల్లా ఉపాధ్యక్షుడు కుంట లింగారెడ్డి, రైతులు నాగర్తి విఠల్​రెడ్డి, బోయిని యాదయ్య, సాయిలు, సాయిరెడ్డి,  సిద్ధరాములు పాల్గొన్నారు.