బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. నీళ్లు, నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మించి ద్రోహం చేసిన పార్టీ బిఆర్ఎస్ అని ఆరోపించారు. రైతుల ద్రోహి కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. లంచాలు తీసుకుని సిగ్గులేని పనులు బీఆర్ఎస్ నాయకులు చేశారని ఆరోపించారు.
రామగుండం మండలం 18 ఇంక్లైన్ కాలనిలో గడ్డం వంశీ కృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ కులమతాలను కలుపుకపోయే పార్టీ అని చెప్పారు. ప్రపంచం లోనే ఎక్కడ లేని సోలార్ పై కప్పు ప్రొడక్ట్ ని,చార్జింగ్ బైక్ నీ కనిపెట్టానని దాని పై తనకు అమెరికా గవర్నమెంట్ పేటెంట్ హక్కు ఇచ్చిందని చెప్పారు.
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ప్రభుత్వ సంస్థలను తీసుకువచ్చి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మీ ఇంట్లో చిన్న కొడుకు భావించి నన్ను గెలిపించాలని కోరారు.