కైట్స్ Vs డ్రోన్స్ : ఢిల్లీ బోర్డర్ లో రైతుల వినూత్న ఐడియా


ఢిల్లీలో రైతుల నిరసన రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. రైతు సంఘాలను ఆపడానికి పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పోలీసులు  ఎన్ని వేసిన రైతులు వాటిన తిప్పు కొడుతున్నారు. టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్స్, బారికేట్స్, వాటర్ కెనాన్లు, ముళ్ల కంచెలు ఉపయోగించి రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. 25 వేల మంది పోలీసులు ఢిల్లీ చుట్టు పక్కల మోహరించారు. పరిస్థితులను అదుపుచేయడానికి పోలీసులు 30వేల టియర్ గ్యాస్ లను ఆర్డర్ సీఐఎస్ఎఫ్ ధళాలు తెలిపాయి. అయితే రైతుల కదలికలను గమనించడానికి భధ్రతా బలగాలు శింఘూ బార్డర్ ఆకాశంలో డ్రోన్లు తిప్పుతున్నారు. పోలీసుల డ్రోన్లను రైతులు గాలిపటాలతో  కింద పడేస్తున్నారు. వీడికి సంబంధించిన వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని తిప్పి కొట్టడానికి పోలీసులు ఫ్రొఫెషనల్ కైట్ మాస్టర్స్ ను రంగంలోకి దింపుతామని అన్నారు.

Also read : టెన్త్‌ స్టూడెంట్ల టిఫిన్​ కోసం రూ. 4 లక్షలు డొనేషన్

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమలులో ఉంది. హర్యాన గవర్నమెంట్ ఫిబ్రవరి 17 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. వాయిస్ కాల్స్ తప్ప మిగతా సర్వీసులపై తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. ఈ రోజు (ఫిబ్రవరి 16) గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునివ్వగా దేశంలో చాలా చోట్ల నిరసనలు జరితే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు నాల్గొవ సారి రైతు సంఘాల నాయకులతో ఆదివారం మాట్లాడనున్నారు. రైతులు రాజధానిలోకి ప్రవేశిస్తే పోలీసులు ఛత్రసల్ స్టేడియం దగ్గర వారిని ఆపడానకి ఏర్పాటు చేస్తున్నారు.