అడ్డగోలుగా చల్లుతున్నరు
దేశంలో ఎకరాకు 51 కిలోల ఫర్టిలైజర్లు వాడితే రాష్ట్రంలో 185 కిలోల వాడకం
ఎన్‌పీకే వినియోగంలోనైతే దేశంలో తెలంగాణది ఫస్ట్
రాష్ట్ర వ్యవసాయ శాఖ స్టడీలో వెలుగులోకి
ఏటేటా తగ్గాల్సిన ఎరువుల వాడకం పెరగడంతో ఆందోళన
సత్తువ తగ్గుతున్న భూమి.. సచ్చిపోతున్న సూక్ష్మజీవులు
డయాబెటిస్, ఒబేసిటీ లాంటి రోగాల బారిన పడే ప్రమాదం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కెమికల్ ఫర్టిలైజర్లను విపరీతంగా వాడేస్తున్నారు. నేషనల్ యావరేజ్ కన్నా మూడింతలు ఎక్కువగా చల్లుతున్నారు. దేశంలో ఎకరాకు సగటున 51.2 కిలోల ఎరువులను వాడుతుంటే రాష్ట్రంలో 185 కిలోలు వినియోగిస్తున్నారు. ఎన్‌పీకే (నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం) వాడకంలోనైతే దేశంలోనే రాష్ట్రం ఫస్టుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. ఏటేటా తగ్గాల్సిన రసాయన ఎరువుల వాడకం ఇలా అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంతలా వాడితే పర్యావరణంతో పాటు మనుషులకూ ప్రమాదం తప్పదని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
ఎరువులను ఎట్ల వాడుతున్నమంటే..
2016 ఖరీఫ్(వానకాలం), రబీ (యాసంగి) సీజన్‌లలో కలిపి 24 లక్షల టన్నుల ఎరువులు వాడగా 2017 వానకాలం, యాసంగిలో 28.39 లక్షల టన్నులు వాడారు. 2019 రెండు సీజన్‌లలో కలిపి 35 లక్షల టన్నలకు చేరింది. 2020 ఖరీఫ్‌లో దాదాపు 23 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి వచ్చాయి. ఇందులో యూరియా 11 లక్షల టన్నులుంది. ఇప్పుడు యాసంగిలోనూ 18.30 లక్షల టన్నుల ఎరువులు వస్తున్నాయి. వరి, పత్తి సాగు పెరగడంతో యూరియా వాడకం సాధారణంగా కొంత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మోతాదుకు మించి వేస్తుండటంతో వాడకం పెరిగిందని అంటున్నారు.
ఎకరాకు నాలుగైదు బస్తాల యూరియా
రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల భూముల్లో ఫాస్పరస్(భాస్వరం) సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలా విపరీతంగా వాడటం వల్ల అది భూమిలో కరగకుండా పేరుకుపోతోంది. యూరియా ఎక్కువ చల్లితే పంట దిగుబడి ఎక్కువ వస్తుందని ఎకరాకు నాలుగైదు బస్తాలు చల్లుతున్నారని అధికారులు చెప్తున్నారు. వరి, పత్తి, మక్కల సాగుకు యూరియా ఎక్కువగా వాడుతున్నారని తెలిపారు. సాగు భూమిలో నైట్రోజన్(నత్రజని) లోపం ఉంటేనే యూరియా చల్లాలంటున్నారు.
చెప్పేవారు లేక.. దిగుబడి ఆశతో..
వాస్తవానికి భూసారాన్ని పరీక్షించి దాని ప్రకారం ఎరువులను వాడాలి. కానీ పంటలకు ఎంత మోతాదులో ఎరువులు కొనాలి, పంటలకు ఎన్నిసార్లు వేయాలో రైతులకు స్పష్టంగా తెలియకనే వాడకం పెరుగుతోందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. దిగుబడి ఎక్కువ వస్తుందనే ఆశతో భారీగా ఎరువులను వాడుతున్నారని ఓ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్త వివరించారు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చూ పెరుగుతోందని తెలిపారు. వ్యవసాయాధికారులు చిట్టీ రాసిచ్చిన ప్రకారం ఎరువులు అమ్మేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం గతంలో చెప్పింది. కానీ అది అమలు కాలేదు.
అలాంటి పంటలు తింటే రోగాలొస్తయ్
రసాయన ఎరువులు ఎక్కువగా వాడితే భూసారం దెబ్బతింటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎక్కువ ఎరువులతో పండిన పంటలు తింటే ఆరోగ్యం పాడైపోతుందని చెబుతున్నారు. దీర్ఘకాలంలో కిడ్నీ, లివర్సమస్యలతో పాటు డయాబెటిస్వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఈ సమస్యలు ఎక్కువున్నాయని చెబుతున్నారు. పైగా ఎరువులు ఎక్కువగా వాడటంతో పర్యావరణం దెబ్బతింటోందని.. పంటలకు ఉపయోగయపడే చిన్న, చిన్న సూక్ష్మజీవులు చనిపోతున్నాయని వివరిస్తున్నారు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా పెరుగుతున్నాయంటున్నారు.
పోటాపోటీగా మందులేస్తున్రు
నీటిపారుదల ఉంది కదా అని దిగుబడి ఆశతో రైతులు ఎక్కువ ఎరువులు వేస్తున్నరు. ఒక రైతును చూసి మరొకరు పోటీగా కూడా చల్లుతున్నరు. ఫలితంగా భూమిలోని పోషకాల సమతుల్యత దెబ్బతింటోంది. పంటలపై ప్రభావం పడుతోంది. మేలు చేసే సూక్ష్మజీవులను, భూమిలోని జీవం చంపేస్తున్నాం. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఎండకాలంలో అ నీళ్లు పైకొచ్చినపుడు ఇంకా ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో రాత్రి టెంపరేచర్ తగ్గుతుంది. కాబట్టి వరి నారు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. అది ఎరువుల లోపం కాదు. ఇలాంటి టైమ్‌లో ఎరువులు వేయకుండా వేరే జాగ్రత్తలు తీసుకోవాలి.
– సురేందర్‌బాబు, జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, ప్రిన్సిపల్ సైంటిస్ట్
ఎక్కువైతే తీవ్ర అనారోగ్య సమస్యలు
కెమికల్ ఫర్టిలైజర్లు ఎక్కువగా వాడిన పంట ఉత్పత్తులు తింటే డయాబెటిస్, ఒబేసిటీ లాంటి లైఫ్ స్టైల్ డీసీజెస్వస్తాయి. ఒబేసిటీ పెరిగితే గుండె సంబంధిత వ్యాధులొస్తాయి. రాష్ట్రంలో 20, 30 ఏండ్ల కిందట డయాబెటిస్ తక్కువుంది. డీఏపీ, యూరియాను వరిలో ఎక్కువగా వాడటంతో ఇప్పుడు షుగర్ సాధారణమవుతోంది. ఫాస్పరస్ లెవెల్స్ ఎక్కువుంటే లివర్, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ్యూచర్లో గ్యాస్ర్టో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫెర్టిలిటీ సమస్యలూ రావొచ్చు.
– డాక్టర్ సోమ శేఖర్, అపోలో హాస్పిటల్స్
For More News..
పీసీసీ చీఫ్ ప్రకటనపై సాగర్ బై ఎలక్షన్ దాకా ఆగుదం
నిలోఫర్‌లో మందుల్లేవ్.. చిన్నారులకు ట్రీట్మెంట్ లేదు
హైదరాబాద్‌లో భూడ్రామా! మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్.. అసలు ఏం జరిగింది..
యూరియా అడ్డగోలుగా చల్లుతున్నరు.. దేశంలో 51 కిలోలు వాడితే.. రాష్ట్రంలో మాత్రం 185 కిలోలు
- తెలంగాణం
- January 7, 2021
మరిన్ని వార్తలు
-
ఆధ్యాత్మికం : లక్ష్మణుడికి.. రాముడు చెప్పిన భక్తి మార్గాలు ఇవే.. నవ విధ భక్తి మార్గాలు ఇవే..!
-
అసెంబ్లీలో కేటీఆర్‌కు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కౌంటర్
-
Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
-
Jasprit Bumrah: బుమ్రా పాకిస్థాన్ దిగ్గజ పేసర్‌ను గుర్తు చేస్తున్నాడు: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్
లేటెస్ట్
- ఆధ్యాత్మికం : లక్ష్మణుడికి.. రాముడు చెప్పిన భక్తి మార్గాలు ఇవే.. నవ విధ భక్తి మార్గాలు ఇవే..!
- అసెంబ్లీలో కేటీఆర్‌కు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కౌంటర్
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Jasprit Bumrah: బుమ్రా పాకిస్థాన్ దిగ్గజ పేసర్‌ను గుర్తు చేస్తున్నాడు: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్
- ఆర్.నారాయణమూర్తికీ ఓ లవ్ స్టోరీ ఉంది.. పెళ్లి వరకు వెళ్లారు కానీ.. డబ్బే కారణమా..!
- Good News: మద్యం ప్రియులకు పండగే.. ఏపీలో భారీగా తగ్గనున్న ధరలు..
- అసెంబ్లీలో మంత్రి కోమటి రెడ్డి vs కేటీఆర్ మధ్య మాటల యుద్ధం
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు ఇద్దరు వైస్ కెప్టెన్లు.. కమ్మిన్స్ లేకపోతే బాధ్యతలు ఎవరికి..?
- ఏపీలోని ప్రకాశం జిల్లా భూ ప్రకంపనలు : ఇళ్ల నుంచి జనం పరుగులు
Most Read News
- మీ కోసమే : జనవరి 20లోపు.. ఈ కార్డులకు కచ్చితంగా KYC అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే పని చేయవు..
- మూవీ రివ్యూ: ఉపేంద్ర యూఐ సినిమా ఎలా ఉందంటే.?
- ఆ నది నీటిని ముట్టుకున్నారా... పుణ్యం రాకపోగా... పాపాలు రెట్టింపవుతాయి..స్నానం చేస్తే అంతే సంగతులు..
- KPHB హాస్టల్ లో కడప కుర్రోళ్ల దాడి : ఒకరు అనుకుని మరొకర్ని చావకొట్టారు
- SA vs PAK 2024: క్లాసెన్, మిల్లర్‌తో గొడవకు దిగిన రిజ్వాన్
- ఖమ్మం కలెక్టర్ మానవత్వం.. పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ. లక్ష సాయం
- HYD : మాదాపూర్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
- 8 ఏళ్ల తర్వాత.. 8 రూపాయల బస్ ఛార్జీ పెంచిన రాష్ట్రం
- వైన్స్‌లో వేటకొడవళ్లతో బీభత్సం
- ప్రపంచాన్ని వణికిస్తున్న డింగా డింగా వైరస్.. ఎవరెవరికి వస్తుంది.. ఎలా వ్యాపిస్తుంది.. దీని లక్షణాలు ఏంటీ..?