వాన రాక రైతులు బేజారు

వానలు ముఖం చాటేయడంతో.. రైతులు ఆందోళనలో మునిగిపోయారు. ప్రతి ఏడాది.. ఈ పాటికి విత్తనాలు వేసే వాళ్లమని.. ఈ సారి వానలు లేకపోవడంతో.. తెచ్చుకున్న విత్తనాలు కూడా వృథా అవుతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పరేషాన్ అవుతున్నారు.

వానదేవుని కరుణ కోసం కరీంనగర్ రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. సాధారణంగా ఈ పాటికే వర్షాలు పడి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి. కానీ.. ఇప్పటికీ చినుకు జాడలేదు. భూగర్భ జలాలు కూడా అడుగంటి  బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ప్రాజెక్టుల్లో నీళ్లు ప్రమాదపుటంచుకుకు చేరుకున్నాయి. దీంతో ప్రత్యామ్నాయాలు కూడా ఏమీ లేక రైతులు దిగులు పడుతున్నారు. రుతుపవనాల జాడ కోసం ఎదురు చూస్తున్న కరీంనగర్ జిల్లా రైతుల కష్టాలకు సంబంధించిన మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు.

వరంగల్ జిల్లాలోనూ అన్నదాతలు వాన కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు తొలకరి వర్షాలు పడకపోవడంతో.. ఆందోళన చెందుతున్నారు. దుక్కులు దున్ని చదును చేసుకుని.. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకున్నా.. నింగి నుంచి చినుకు రాలడం లేదు. వరంగల్ జిల్లాలో రైతుల పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు లేక ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. మృగశిరకార్తె ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు కొద్దిపాటి  వర్షం పడడంతో మెదక్ జిల్లా.. రైతులు దుక్కులు దున్ని వాన కోసం ఎదురుచుస్తున్నారు. యాసంగిలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వేసిన కొద్దిపాటి పంటలకు కూడా పెట్టుబడి రాక రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. ఖరీఫ్ లో అయినా వర్షాలు పడి.. పంటలు బాగా పండుతాయని ఆశగా చూస్తున్నారు రైతులు. మహబూబ్ నగర్ లో ఖరీఫ్ సాగు ఎలా ఉందనే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు.