శవాల మీద పేలాలు ఎరుకునే సంస్కృతి మీది, మీ పార్టీది : కోదండరెడ్డి

శవాల మీద పేలాలు ఎరుకునే సంస్కృతి మీది, మీ పార్టీది : కోదండరెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై  రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఖమ్మంలో రైతుకు బేడీలు వేసింది బీఆర్ఎస్ పార్టీనే కాదా అని ప్రశ్నించారు.  ఇందిరా గాంధీ పేదలకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం వేలం వేసి అమ్ముకుందని ఆరోపించారు.

అధికారంలో ఉండగా భూ రికార్డుల సవరణ పేరుతో ధరణి అనే వ్యవస్థను తెచ్చి IT శాఖా మంత్రిగా రైతుల భూముల వివరాలు, ఆధార కార్డ్, బ్యాంకు ఖాతా నంబరు విదేశీ కంపెనీకు ఇచ్చింది మీరు కాదా..?  రెవెన్యూ మంత్రిగా ఉండి 30 లక్షల ఎకరాల భూమిని నిషేదిత జాబితాలో పెట్టి తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమి హక్కును రద్దు చేసింది మీరు కాదా.. ?   ధరణి దేశంలోనే ఒక “భూ కుంభకోణం” మీరు చేసిన ఈ నిర్వాకం వల్ల ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, కుటుంబంతో సహా రోడ్డున పడ్డారు. శవాల మీద పేలాలు ఎరుకునే సంస్కృతి మీది, మీ పార్టీది..! 

ALSO READ | 8 మందిని కాపాడేందుకు ఎక్స్‎పర్ట్‎లను రంగంలోకి దింపుతున్నాం: SLBC టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్

TRS పార్టీని BRS పార్టీగా మార్చుకున్న రోజే తెలంగాణ పదాన్ని ఉచ్చరించే నైతిక హక్కు మీరు కోల్పోయారు. ఆ మాటకొస్తే మీరు ప్రతి పక్షంగా కూడా పనికిరారు. ఎన్నికలైన తరువాత ప్రజా తీర్పు మేరకు మిమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో కూర్చుండబెడితే ప్రతిపక్ష నాయకుడిగా అన్నీ హోదాలు అనుభవిస్తూ శాసన సభకు అడుగుబెట్టకపోవడం రాష్ట్ర చరిత్రలో మొదటి సారి అని తన ఎక్స్ లో కోదండ రెడ్డి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. 

అంతకు ముందు రైతు కమిషన్ ఛైర్మన్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవాలు చెప్పాల్సింది పోయి..కోదండ రెడ్డి వాటిని కప్పిపుస్తున్నారని అన్నారు. ఎండలు ఎక్కువ కావడం వల్ల పంటలు ఎండిపోయాయని కోదండ రెడ్డి మాట్లాడం విడ్డూరం.  పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతుంటే బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దంటూ ఉచిత సలహాలు ఇస్తారా అని ధ్వజమెత్తారు కేటీఆర్.