రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

కోరుట్ల/కోనరావుపేట, వెలుగు: రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్నామని ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం కథలాపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో 113 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, రూ.23.47 లక్షల విలువైన 58 సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, అయినా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

కోనరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని సొసైటీలో కొత్తగా నిర్మించిన గోదాంను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సొసైటీలు రైతుల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, ఏఎంసీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సింగిల్ విండో చైర్మన్లు బండ నరసయ్య, రామ్మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, వైస్ చైర్మన్ భూమిరెడ్డి, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయప్రకాశ్ రావు, ఏఎంసీ డైరెక్టర్లు  పాల్గొన్నారు.