అధికార పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు రోజుకో చోట నిరసన సెగ తగుల్తోంది. సమస్యలు పరిష్కారించాలంటూ ఓ చోట, ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మరో చోట ఇలా అడుగడుగునా ప్రజా ప్రతినిధులను నిలదీస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. గత 15 రోజుల్లోనే ఇలాంటి ఘటనలు మూడు జరిగాయి.
ఇటీవలే ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు కందాల ఉపేందర్ రెడ్డిని అడ్డుకున్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా తొండపల్లి గ్రామానికి వెళ్లిన వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. లేటెస్ట్ గా ఏప్రిల్ 23న పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని రైతులు అడ్డుకున్నారు.
పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. కెనాల్ కింద పోయిన తమ భూముల వివరాలు ధరణి పోర్టల్ లో కనిపించకుండా పోయాయని తహశీల్దార్ కు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యేను నిలదీశారు రైతులు.