త్రిబుల్ ఆర్ సర్వేను అడ్డుకున్న రైతులు

త్రిబుల్ ఆర్ సర్వేను అడ్డుకున్న రైతులు

శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామంలో గురువారం త్రిబుల్ ఆర్ కు భూసేకరణ కోసం సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు.   రైతులకు  భూమి గుంట కూడా లేకుండా పోతోందని, అలా అయితే ఎలా బతకాలని, తమకు ఆత్మహత్యలే శరణ్య మని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని వేడుకున్నారు.

లేకుంటే తాము అడ్డ మీద కూలీలుగా బతకాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఆర్​ ఐ  కిషన్ రైతుల విజ్నప్తిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పి సర్వే నిర్వహించారు.