ట్రిపుల్​ఆర్​ సర్వేను అడ్డుకున్న రైతులు

ట్రిపుల్​ఆర్​ సర్వేను అడ్డుకున్న రైతులు

నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామ రైతులు ట్రిపుల్​ఆర్ సర్వే ను గురువారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొండపోచమ్మ సాగర్, విద్యుత్ లైన్, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయామని మళ్లీ ఇప్పుడు ట్రిపుల్​ఆర్ పేరిట భూములు కోల్పోడానికి సిద్దంగా లేమన్నారు. తమకు భూమికి బదులు భూమి ఇచ్చి తగిన న్యాయం చేయాలని సర్వేకు వచ్చిన ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, ఆఫీసర్లను వేడుకున్నారు.

రైతులు సర్వేకు  సహకరించకపోవడంతో ఆఫీసర్లు వెనుతిరిగారు. ఈ విషయమై ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ట్రిపుల్​ఆర్ భూ నిర్వాసితులు కలెక్టర్ ను కలిశారని సరైన నష్టపరిహారం కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ కూడా వేశారన్నారు. త్వరలోనే సర్వే పనులు రైతుల సమక్షంలో చేపడతామని తెలిపారు.