
మెదక్ (వెల్దుర్తి), వెలుగు : వెల్దుర్తి లోని సెంట్రల్ బ్యాంక్ అకౌంట్నుంచి ధాన్యం అమ్మిన, రైతుబంధు పైసలు డ్రా చేసుకునే విషయంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మూడు రోజుల కింద రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లో నిలబడే ఓపిక లేక ఖాతాదారులు తమ చెప్పులను క్యూలైన్లో ఉంచిన సంగతి తెలిసిందే. బ్యాంక్ కు డబ్బులు తక్కువగా వస్తుండడం, స్టాఫ్ తక్కువగా ఉండడంతో డబ్బుల చెల్లింపులో ఆలస్యమవుతోంది.
దీంతో ఖాతాదారులు గంటల తరబడి వేచి ఉండక తప్పడం లేదు. రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో శుక్రవారం డబ్బులు అవసరమైన వారు బ్యాంక్ తెరవక ముందే వచ్చారు. అయినా అప్పటికే రష్ఉండడంతో చెప్పులను క్యూలైన్ లో ఉంచారు. ఆ సీరియల్ ప్రకారమే బ్యాంక్ లోకి వెళ్లి డబ్బులు విత్డ్రా చేసుకున్నారు.