వడ్లు అమ్మి నెలయ్యింది.. మా పైసలు ఇంకెప్పుడిస్తరు?

మల్లాపూర్, వెలుగు :- ‘వడ్లు అమ్మి నెలయ్యింది. మా పైసలు ఎప్పుడిస్తరు’ అంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్​ మండలం కొత్తధాంరాజ్‌‌‌‌పల్లి  రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తధాంరాజ్​పల్లిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 

గ్రామానికి చెందిన పన్నాల నారాయణరెడ్డి అనే రైతు కమాన్ ​ఎక్కి పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వడ్లు అమ్మి నెల అవుతోందని, పెట్టుబడి కోసం చేసిన అప్పులు, ట్రాక్టర్, హార్వెస్టర్ ​కిరాయిలు కట్టాల్సి ఉందని, ఇన్ని రోజులైనా డబ్బులు రాకపోతే ఏంచేయాలని ప్రశ్నించారు. వానాకాలం సీజన్‌‌‌‌లో మళ్లీ నాట్లు వేయాలంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రవీందర్ అక్కడికి రాగా ఆయనతో గోడు వెల్లబోసుకున్నారు. 

తొందరగా డబ్బులు ఇప్పించాలని దండం పెట్టి వేడుకున్నారు.  నాలుగైదు రోజుల్లో డబ్బులు వచ్చేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. బద్ధం శంకర్ రెడ్డి , కాట్టిపల్లి రాజేందర్, గజ్జి శ్రీనివాస్, బద్దం సుధాకర్ పాల్గొన్నారు. ‘వడ్లు అమ్మి నెలయ్యింది. మా పైసలు ఎప్పుడిస్తరు’ అంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్​ మండలం కొత్తధాంరాజ్‌‌‌‌పల్లి  రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తధాంరాజ్​పల్లిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

గ్రామానికి చెందిన పన్నాల నారాయణరెడ్డి అనే రైతు కమాన్ ​ఎక్కి పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వడ్లు అమ్మి నెల అవుతోందని, పెట్టుబడి కోసం చేసిన అప్పులు, ట్రాక్టర్, హార్వెస్టర్ ​కిరాయిలు కట్టాల్సి ఉందని, ఇన్ని రోజులైనా డబ్బులు రాకపోతే ఏంచేయాలని ప్రశ్నించారు. వానాకాలం సీజన్‌‌‌‌లో మళ్లీ నాట్లు వేయాలంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రవీందర్ అక్కడికి రాగా ఆయనతో గోడు వెల్లబోసుకున్నారు. తొందరగా డబ్బులు ఇప్పించాలని దండం పెట్టి వేడుకున్నారు.  నాలుగైదు రోజుల్లో డబ్బులు వచ్చేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. బద్ధం శంకర్ రెడ్డి , కాట్టిపల్లి రాజేందర్, గజ్జి శ్రీనివాస్, బద్దం సుధాకర్ పాల్గొన్నారు.