ఫామ్​హౌస్ నిర్వాహకులు బాధ్యతగా మెలగాలి

ఫామ్​హౌస్ నిర్వాహకులు బాధ్యతగా మెలగాలి
  • రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ 

చేవెళ్ల, వెలుగు: ఫామ్​హౌస్ నిర్వాహకులు బాధ్యతగా మెలగాలని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ సూచించారు. మొయినాబాద్​లోని ఓ ఫంక్షన్​లో చేవెళ్ల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఫామ్ హౌస్ నిర్వాహకులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫామ్​హౌస్ నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్​ను తప్పనిసరిగా గ్రామ పంచాయతీ ద్వారా పొందాలన్నారు.

అనుమతులు లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే ఫామ్​హౌస్​లను సీజ్​ చేస్తామని డీసీపీ హెచ్చరించారు. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న, లిక్కర్ వినియోగించిన ఆన్ లైన్ ద్వారా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు.

ఫామ్ హౌస్​లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాల పార్కింగ్, ఈవెంట్ నిర్వహించే స్థలం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో చేవెళ్ల ఏసీపీ కిషన్​రావు, మొయినాబాద్ సీఐ పవన్​ కుమార్​రెడ్డి, ఎస్సైలు నర్సింహ్మరావు, ముజాపర్ అలీ, నహిముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.