- న్యూడ్ డ్యాన్సులు, ముజ్రా పార్టీలు
- స్పెషల్‌గా గేమింగ్ జోన్స్
- లోపలకు ఎవరూ రాకుండా హై సెక్యూరిటీ, సీసీ కెమెరాలు, బౌన్సర్లు
- గ్రేటర్‌లో 250కి పైగా లీజ్ ఫామ్‌హౌస్‌లు
- గతేడాది ఫాంహౌస్లలో పోలీసుల రైడ్స్
హైదరాబాద్, వెలుగు: సిటీ శివారులోని ఫాంహౌస్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. సంపన్నులు, రాజకీయ నేతలు,సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు ఇలా ప్రతి ఒక్కరికీ ఫామ్‌హౌస్ స్టేటస్ సింబల్‌గా మారడంతో ఫాంహౌస్ నిర్మించుకుంటున్నారు. వీకెండ్స్‌లో ఇక్కడికే వెళ్లి రిలాక్స్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఫామ్‌హౌస్ పార్టీ కల్చర్ పెరిగిపోయింది. బర్త్ డే వేడుకల దగ్గరి నుంచి ఏ సెలబ్రేషన్ జరుపుకోవాలన్నా ఫామ్‌హౌస్‌లే అడ్డాలుగా మారుతున్నాయి. ఫాంహౌస్‌లను కట్టి రెంట్‌కు కూడా ఇస్తుండడంతో యూత్ఎక్కువగా వీకెండ్స్ పార్టీ చేసుకోవడానికి ఇక్కడికే వెళ్తున్నారు. ఐటీ ఉద్యోగులు, సంపన్నులు, వారి పిల్లలు, సెలబ్రిటీలు, వారి కుటుంబాలు, ఇతర ప్రముఖులు పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నాయి.
లిక్కర్ పార్టీలతో సరిపెట్టకుండా అంతకుమించి ముందుకు పోతున్నారు. విచ్చలవిడిగా డ్రగ్స్, గాంజా వాడుతూ డీజేల మోతతో మత్తెక్కిపోతున్నారు. మరికొందరైతే అమ్మాయిలను పార్టీలో పార్టిసిపేట్ చేయిస్తుండడంతో సెక్సువల్ యాక్టివిటీస్‌కు కూడా వేదికలుగా మారుతున్నాయి. ఫన్ కోసం రాష్ట్రంలో నిషేధంలో ఉన్న పేకాట, క్యాసినో, పోకర్ లాంటి నిషేధిత గేమ్స్ నిర్వహిస్తున్నారు. టేబుల్స్వేసి రౌండ్స్ చొప్పున ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఆటగాళ్లకు లిక్కర్‌తో పాటు ఫుడ్ సప్లై చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. ఇలాంటి ఫామ్‌హౌస్‌ల కోసం వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది.
ట్రై కమిషనరేట్ల పరిధిలో 530 ఫాంహౌస్లు
గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 530కి పైగా ఫామ్‌హౌస్‌లున్నాయి. వీటిలో అత్యధికంగా మొయినాబాద్ పీఎస్‌లో పరిధిలోనే 500 వరకు ఉన్నాయి. వీటిలో 250 ఫామ్‌హౌస్‌లు లీజ్‌కు నిర్వహిస్తుండగా, మరో 250 వరకు యజమానులు సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారు. మోకిలా, శంకర్‌పల్లి పీఎస్‌ల పరిధిలో దాదాపు 32 ఫామ్‌హౌస్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇందులో ప్రైవేట్‌వ్యక్తులు లీజుకు తీసుకున్న ఫామ్‌హౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. ఇక్కడ లోపల ఏం జరుగుతుందన్నది బయటి ప్రపంచానికి తెలియదు. అంతా పక్కాగా ఉంటుంది. సెక్యూరిటీ కూడా టైట్‌గా ఉంటుంది. ఫాంహౌస్ చుట్టూ ఎప్పుడూ సెక్యూరిటీని కాపలాగా ఉంచుతున్నారు. హై డెఫినేషన్కెమెరాలతో పోలీసుల రాకను గుర్తించి అలర్టయ్యేలా సిస్టమ్సెట్ చేసుకుంటున్నారు. ఒక్కోసారి బౌన్సర్లు కూడా కాపలా కాస్తూ కనిపిస్తారు.
గతేడాది 32 ఫాంహౌస్లలో దాడులు
అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో సైబరాబాద్ పోలీసులు నిఘా పెంచారు. గత ఏడాది ఫిబ్రవరిలో వరుస దాడులు నిర్వహించారు. మొయినాబాద్ ఓ ఫామ్‌హౌస్ లో ముగ్గురు అమ్మాయిలతోపాటు నలుగురు విటులు, ఇద్దరు ఆర్గనైజర్లు, ఫామ్‌హౌస్ వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఫామ్‌హౌజ్‌లో వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు మోడల్స్‌తో పాటు..ముగ్గురు విటులు, ఆర్గనైజర్ ను అరెస్ట్ చేశారు. మొత్తం 32 ఫామ్ హౌస్ ల్లో సోదాలు నిర్వహించి ఇల్లీగల్యాక్టివిటీస్అడ్డుకట్ట వేశారు. అయినా ఎక్కడా ఫాంహౌస్లలో పార్టీలు తగ్గడం
సెమీ న్యూడ్ డ్యాన్సులు, ముజ్రా పార్టీలు
ఫాంహౌస్‌లో అమ్మాయిలతో పార్టీలంటేనే యూత్ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కాబట్టి వారిని అట్రాక్ట్ చేయడానికి కొందరు నిర్వాహకులు గర్ల్స్‌తో పార్టీలు నిర్వహిస్తున్నారు. ముంబయి, వెస్ట్ బెంగాల్, ఏపీ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకువచ్చి డ్యాన్సులు చేయిస్తున్నారు. క్లబ్స్ తరహాలో సెమీ న్యూడ్ డ్యాన్సులు, ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సిటీలో కొన్ని గ్యాంగ్స్ కూడా పనిచేస్తున్నాయి. వీరు ఆన్‌లైన్ బుకింగ్స్‌తో ఫాంహౌస్లలో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కూడా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి ఫామ్‌హౌస్‌లపై దాడులు నిర్వహిస్తున్నారు.