యూకేకు చెందిన ఫరూఖ్ జేమ్స్‌కి పన్నెండేండ్లు. సోషల్ మీడియాలో ఈ బాబు జుట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫరూక్ ఇప్పుడొక సెలబ్రిటీ. కానీ, స్కూల్లో మాత్రం అతడికి నో ఎంట్రీ. అదేంటి అంటున్నారా! ఫరూక్‌కి పొడవాటి జుట్టే ఐడెంటిటీ. సోషల్ మీడియాలో ఈ అబ్బాయి జుట్టుకి బోల్డెంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ స్కూల్ వాళ్లు మాత్రం అంత పొడవు జుట్టు ఉంటే స్కూల్‌కి రావడానికి వీల్లేదని చెప్పింది.
అలా ఎందుకు చెప్పింది? పొడవాటి జుట్టు ఉంటే సమస్య ఏంటి?
రూక్ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఈ పన్నెండేండ్లలో ఒక్కసారి కూడా హెయిర్ కట్ చేయింలేదు వాళ్ల పేరెంట్స్. అందుకు కారణం జుట్టు మీద విపరీతమైన ఇష్టమో, తనకు అది ఐడెంటిటీ కావాలనో కాదు. ఫరూక్‌కి హెయిర్ కట్ చేయించుకోవాలంటే భయం. ఆ భయంతోనే తను ఇన్నేండ్లుగా జుట్టు కత్తిరించుకోవట్లేదు. డాక్టర్లకు చూపిస్తే ‘‘ఫరూక్ ‘టోన్సురేఫోబియా’ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ ఫోబియా ఉన్నవాళ్లు జుట్టు కత్తిరించుకోవాలంటే భయపడతార’’ని చెప్పారు. దాంతో పేరెంట్స్‌కి ఏం చేయాలో తోచక జుట్టు కత్తిరించకుండా అలాగే వదిలేశారు. దానివల్ల ఇప్పుడు అబ్బాయి ముఖం కంటే జుట్టే ఎక్కువగా కనిపిస్తుంది.
అయితే స్కూల్ మేనేజ్మెంట్ మాత్రం ‘‘ఫరూక్స్నేహితులు కూడా చిరాకు పడుతున్నారు. మామూలుగా బడికి వెళ్లే పిల్లలకు క్రమశిక్షణ ముఖ్యం. జుట్టు, గోళ్లు ఎక్కువగా పెంచుకోకూడదని కొన్ని రూల్స్ ఉంటాయి. వాటి ప్రకారం తను జుట్టు కత్తిరించాల్సిందే’’ అని ఫరూక్ పేరెంట్స్‌కి గట్టిగా చెప్పింది. అయితే ‘‘ఫరూక్ గుండు కొట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడు. అందుకే పన్నెండేండ్ల నుంచి అలా వదిలేశాం’’ అని మెడికల్ రిపోర్టు చూపించారు.
మెడికల్ రిపోర్ట్ చూసినా స్కూల్ మేనేజ్మెంట్ బోర్డు మాత్రం జుట్టు కత్తిరించాల్సిందేనని కరాఖండిగా చెప్పింది. దాంతో ఫరూఖ్ తల్లి పోనీ టైల్ వేసి పంపిస్తానని చెప్పింది. అందుకు కూడా స్కూల్ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. ఆ జుట్టు వల్ల స్కూల్లో చాలాసార్లు పనిష్మెంట్ తీసుకున్నాడు ఫరూక్. స్కూల్ వాళ్లు అంత గట్టిగా ఉండడంతో ‘మా అబ్బాయిని స్కూల్ నుంచి పంపించేస్తారేమో’నని పేరెంట్స్ ఆందోళన పడుతున్నారు.