రైతు బాగు కోసమే ఫసల్ బీమా

నది పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశం. దేశవ్యాప్తంగా పంటల సాగుకు వర్షాలే ప్రాణాధారం. అయితే రుతుపవనాలు ఎలా ఉంటాయనే దానిపై క్లారిటీ లేకపోవడంతో పంటల దిగుబడిపై ఒక అంచనా వేయడం కుదరదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ప్రగతిపథంలో నడిపించడానికి పంటల బీమా రూపంలో అన్నదాతకు నష్టభయం నుంచి విముక్తి కల్పించి, విపత్తు ప్రభావాల నుంచి వారికి రక్షణ కల్పించడం అత్యవసరం. దీనిని గుర్తించే 2014లో ఏర్పడిన మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.

పంట నష్టం నుంచి రైతుకు రక్షణ ఇవ్వడం, పంటల బీమా పథకాల్లో లోటుపాట్లను సరిదిద్ది మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2016 జనవరి 13న రైతుల బాగు కోరుతూ ‘వన్​ నేషన్–వన్​ స్కీమ్’గా ప్రధానమంత్రి ఫసల్​ బీమా యోజన(పీఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీవై)ను ఆవిష్కరించింది. అటుపైన మన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ పథకాన్ని 2016 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. రైతులందరికీ ఒకేరీతిలో అతి తక్కువ బీమా ప్రీమియంతో పారదర్శకత, లేటెస్ట్​ టెక్నాలజీని ఎక్కువగా వాడటం, నిర్దిష్ట వ్యవధితో కంప్లయింట్లను పరిష్కరించే వ్యవస్థ వంటి సానుకూలాంశాలతో ఈ స్కీమ్​ మరింత సమర్థవంతంగా రూపొందింది.

ఎప్పటికప్పుడు మార్పులు

దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ దీనిపై ఎక్కువ ఆసక్తి చూపించడంతో ప్రధానమంత్రి ఫసల్​ బీమా పథకానికి మరింత ఉత్తేజం కలిగించే దిశగా నిరంతరం మార్పుచేర్పులు చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా ఈ స్కీమ్​ కింద రైతులంతా స్వచ్ఛందంగా నమోదయ్యే అవకాశం కలిగింది. దీంతోపాటు బీమా సంస్థలకు మరింత బాధ్యత అప్పగిస్తూ మూడేండ్ల పాటు రాష్ట్రాల్లో ఈ స్కీమ్​ అమలును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ మేరకు రైతులతో నిరంతర సంప్రదింపులకు వీలుగా బీమా కంపెనీలు సమితి స్థాయిలోనూ కార్యాలయాలు తెరుస్తున్నాయి. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడమేగాక రైతులకు విస్తృత అవగాహన కోసం కార్యక్రమాల నిర్వహణకు బీమా ప్రీమియంలో 0.5 శాతాన్ని కంపెనీలు కేటాయించాయి. పంట నష్టానికి సరైన నిష్పత్తిలో రైతులకు పరిహారం నిర్ధారించేలా పంట దిగుబడి విలువకు సమానంగా బీమా రక్షణ మొత్తాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.

అందుబాటులో ఫసల్​ బీమా యాప్

ఈ పథకం అమలును కేంద్ర ప్రభుత్వం డీసెంట్రలైజ్​ చేసింది. నష్టభయం నుంచి అదనపు రక్షణను ఎంచుకునే అవకాశం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలను ఈ పథకంలో భాగస్వాములుగా చేయడం కోసం వారి వంతు వాటాను 50:50 నుంచి 90:10 నిష్పత్తికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ పథకం కింద దేశంలోని కోట్లాది చిన్న, సన్నకారు రైతుల అనుసంధానం, వారి రికార్డుల నిర్వహణ, ఆ రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపడం, ఈ పథకం అమలులో భాగంగా భాగస్వామ్య సంస్థల కార్యకలాపాలను అనుసంధానించడం మొదలైనవి పోర్టల్ లేకుండా అసాధ్యమనే భావన ఉండేది. ఈ సవాళ్లన్నింటి దృష్ట్యా కోట్లాది రైతులు, 1.7 లక్షలకుపైగా బ్యాంకు శాఖలు, 44 వేల సర్వజన సేవా కేంద్రాలను కలగలిపి నేషనల్​ ఫసల్​ బీమా పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతోపాటు రైతులు తమ ఇంటి ముంగిట నుంచే పథకంలో నమోదయ్యేందుకు వీలు కల్పిస్తూ నేషనల్​ ఫసల్​ బీమా యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రవేశపెట్టింది.

లాక్​డౌన్​ టైంలోనూ అకౌంట్లలోకి డబ్బులు

కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా లాక్​డౌన్​ విధించిన మూడు నెలల కాలంలో 70 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో రూ.8,741 కోట్లకుపైగా పంట నష్టపరిహారం నేరుగా జమ అయింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఎంతో చేయూత లభించింది. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిడతల దాడి లేదా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పంటకాలం మధ్యలో విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు రావడం, మహారాష్ట్రలో పంటకోత తర్వాత భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకూ పరిహారం చెల్లించారు. ప్రధానమంత్రి ఫసల్​ బీమా పథకం పోర్టల్ 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండగా, రైతులు బీమా రక్షణ కోసం నేరుగా నమోదు చేసుకునే వీలుంటుంది. అంతే కాకుండా తమ అప్లికేషన్ల స్టేటస్, ప్రీమియం మొత్తం లేదా, కాంపెన్సేషన్​ రిక్వస్ట్ స్టేటస్​ గురించి కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు.

నష్టభయాన్ని తగ్గించడం కోసమే

మరోవైపు ఆండ్రాయిడ్ ఫోన్లలో లభ్యమయ్యే నేషనల్​ ఫసల్​ బీమా యాప్ సాయంతో రైతులు తమ అప్లికేషన్​ స్టేటస్​ గురించి తెలుసుకోగలుగుతారు. అలాగే బీమా గైడ్​లైన్స్​ లిస్ట్​కు అనుగుణంగా ఏదైనా సంఘటన వల్ల పంట నష్టం జరిగితే 72 గంటల్లోగా దాన్ని గురించి నివేదించే వీలుంటుంది. కాంపెన్సేషన్​ రిక్వస్ట్​లను త్వరగా పరిష్కరించే దిశగా స్మార్ట్ మోడల్స్, రిమోట్ సెన్సింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను కూడా ఇందులో జోడించారు. రిక్వస్ట్​ల పారదర్శకత, రైతుల్లో అవగాహన, ఫిర్యాదులకు సకాలంలో పరిష్కారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడడంపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. తద్వారా భవిష్యత్తులో రిక్వస్ట్​లను సత్వరం పరిష్కరించే వీలు కలుగుతుంది.

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పంట నష్టం వాటిల్లినా నష్టభయాన్ని తగ్గించే సాధనంగా ఈ పథకం తోడ్పడుతుంది. కాబట్టి ఈ స్కీమ్​ కింద రిజిస్టర్​ కావడం స్వచ్ఛందమే అయినప్పటికీ, లోన్లు తీసుకోనివారు కూడా పెద్ద సంఖ్యలో ఈ స్కీమ్​లో నమోదు కావాలని ఈ సందర్భంగా నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పథకంతో ముడిపడి ఉండటమంటే సంక్షోభ సమయాల్లో స్వయం సమృద్ధి సాధించడమే. అందుకే ప్రతి రైతుకూ ఫసల్​బీమా ద్వారా సంపూర్ణ స్వావలంబన కల్పించాలన్నది మా కల.

ఐదు రెట్లు ఎక్కువగా పరిహారం

మరోవైపు 2017 నుంచి ఆధార్ ప్రాతిపదికన చెకింగ్​ పద్ధతిని అమలు చేస్తుండటంతో స్కీమ్​ అమలులో మరింత ట్రాన్స్​పరెన్సీ సాధ్యమైంది. దీనివల్ల పరిహారం మొత్తాలు నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్నాయి. ఈ విప్లవాత్మక చర్య కారణంగా నకిలీ లబ్ధిదారులకు స్థానం లేకుండా పోగా, దళారుల బెడద కూడా వదిలిపోయి సకాలంలో పరిష్కారం సాధ్యమైంది. దీంతో 2019 వరకూ రైతులు తాము చెల్లించిన పంటల బీమా ప్రీమియం రూ.16,000 కోట్లకుగానూ ఐదు రెట్లు అధికంగా- రూ.86,000 కోట్ల వరకూ పరిహారం అందుకున్నారు. అంటే- రైతులు చెల్లించిన ప్రతి రూ.100 ప్రీమియమ్​కుగానూ రూ.537 వంతున పరిహారం లభించింది.

లోన్లు తీసుకోని వారికీ వర్తింపు

అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పండించిన పంటకు నష్టం వాటిల్లినపుడు రైతుకు సకాలంలో పరిహారం అందించడం ద్వారా వారి స్వయం సమృద్ధికి ప్రధానమంత్రి ఫసల్​ బీమా పథకం ఎంతగానో సహకరిస్తోంది. ఈ స్కీమ్​ మొదలయ్యాక గడచిన ఐదేండ్లలో సంవత్సరానికి 5.5 కోట్ల మందికిపైగా రైతులు ఈ పథకం కింద నమోదవుతుండగా, మొత్తం 29 కోట్ల మందికి బీమా రక్షణ లభిస్తోంది. మొత్తం మీద రూ.90,000 కోట్లకుపైగా పరిహారాన్ని ఇన్సూరెన్స్​ కంపెనీలు రైతులకు చెల్లించాయి. మునుపటి పంటల బీమా పథకంతో పోలిస్తే తాజా పథకం కింద హెక్టార్​కు రూ.15,100గా ఉన్న బీమా రక్షణను రూ.40,700కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. అలాగే పంట రుణాలు తీసుకోని రైతుల బీమా ప్రీమియం వాటా కూడా గతం(‘పీఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీవై’కి ముందు)లో 6 శాతం కాగా,
2019–20లో ఏకంగా 37 శాతానికి దూసుకెళ్లింది.                               – నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ మంత్రి