
హైదరాబాద్, వెలుగు: ఫ్యాషన్ రిటైలర్ చందన బ్రదర్స్ వికారాబాద్‌లో షాపింగ్ మాల్‌ను తెరిచింది. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్మన్ మంజులా రమేశ్, సినీనటి అనూ ఇమాన్యుయేల్ దీనిని ప్రారంభించారు. వికారాబాద్ చుట్టుపక్కల ఇదే అతిపెద్ద మాల్ అని సంస్థ తెలిపింది.
అన్ని హంగులతో దీనిని రెండు అంతస్తుల్లో, 15 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. కుటుంబానికి, వేడుకలకు అవసరమైన అన్ని రకాల దుస్తులు ఇక్కడ లభ్యమవుతాయి. హోల్‌సేల్ ధరలకే తాము అమ్ముతామని, మాల్ వల్ల వంద మందికి ఉపాధి దొరికిందని సంస్థ యజమాని అల్లక సత్యనారాయణ అన్నారు.