మంచు కొండలపై ఫ్యాషన్ షో.. కశ్మీర్లో రాజకీయ మంటలు పుట్టిస్తున్న ఈవెంట్.. ఎందుకీ వివాదం..?

మంచు కొండలపై ఫ్యాషన్ షో.. కశ్మీర్లో రాజకీయ మంటలు పుట్టిస్తున్న ఈవెంట్.. ఎందుకీ వివాదం..?

ఎక్కడైనా ఫ్యాషన్ షో అంటే మస్త్ క్రేజ్.. ఫుల్ జోష్ ఉంటుంది. లేటెస్ట్ ఫ్యాషన్ కలెక్షన్స్ తో మోడల్స్ చేసే క్యాట్ వాక్ చూసేందుకు ఎగబడుతుంటారు జనాలు. వీటికి ఉండే క్రేజ్ ను  బట్టి బ్రాండ్స్ ప్రమోషన్ చేయడంతో పాటు.. ఆర్థికంగా క్యాష్ చేసుకుంటుంటారు నిర్వాహకులు. వీటిపై పెద్దగా అభ్యంతరాలు కూడా ఎక్కువగా ఉండవు. కానీ తాజాగా కశ్మీర్ లో నిర్వహించిన ఫ్యాషన్ షో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఏకంగా సీఎం సర్దిచెప్పుకునే పరిస్థితి రావడంతో ఈ ఫ్యాషన్ షో ఎందుకు అంత వివాదం అయ్యిందనే చర్చ మొదలయ్యింది.

జమ్మూ కశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఫ్యాషన్ షో నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. సీఎం ఒమర్ అబ్దుల్లా కుటుంబ సభ్యులు నడిపే హోటల్ లోనే ఈ ఫ్యాషన్ షో జరిగిందని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగింది. అది ఒక ప్రైవేట్ ఫ్యాషన్ షో అని.. ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని సీఎం వివరణ ఇచ్చారు. అదే సమయంలో మాజీ సీఎం మెహబూబా మఫ్తీ కూడా కశ్మీర్ విలువలపై దాడిగా పేర్కొంటూ తీవ్ర విమర్శలకు దిగారు. 

కశ్మీర్ లో ఈ ఈవెంట్ తీవ్ర దుమారం రేపడానికి కారణం.. రంజాన్ మాసమే ప్రతిపక్ష సభ్యులు విమర్శిస్తున్నారు. ‘‘సీఎం కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ఈవెంట్ గురించి తెలియదని సీఎం ఒమర్ కు తెలియకపోవడమేంటి.. ఆయన అసెంబ్లీలో అబద్ధం అడారు.. బయట ఆడుతున్నారు’’అని బీజేపీ నేత సునీల్ శర్మ విమర్శించారు. ఇవాళ అసెంబ్లీలో ఈ అంశంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.

ఫ్యాషన్ ఫో నుంచి కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో వివాదం రాజుకుంది. ఫ్యాషన్ షో పేరుమీద చిన్న చిన్న బట్టలు వేసుకుని అసభ్యకరంగా చేసే ఈవెంట్లను కశ్మీర్ లో నిర్వహించడమేంటని మెహబూబా మండిపడ్డారు. కశ్మీర్ విలువలను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజం ప్రమోషన్ పేరున ఇలాంటి అశ్లీల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం తగదని విమర్శించారు. ఇక మత సంస్థలు కూడా ఈ అంశంపై స్పందించారు. కశ్మీర్ సంస్కృతి, సంప్రదాయాలకు ఇలాంటి ఈవెంట్స్ వ్యతిరేకమని అన్నారు. 

దీనిపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని, అధికారుల జోక్యం కూడా లేదని అన్నారు. ప్రైవేట్ గా నిర్వహించున్నారని, ఒకవేళ ఏదైన ప్రభుత్వ అధికారుల పాత్ర ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.