స్మార్ట్ఫోన్కు ఫాస్ట్ చార్జర్తో చార్జింగ్ పెడుతున్నారా..? అయితే మీకో నిజం తెలియాలి..!

ఫోన్ బ్యాటరీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న చార్జర్ వాడడం వల్ల బ్యాటరీపై అధిక భారం పడుతుంది. కొన్నిసార్లు బ్యాటరీ పేలిపోవచ్చు కూడా. ఇప్పుడు వస్తున్న ఇంటర్నల్ బ్యాటరీ ఫోన్లలో బ్యాటరీ వచ్చి బయటకు కనిపించే అవకాశం లేదు. అంటే బ్యాటరీతో పాటు ఫోన్ కూడా పేలిపోయే ప్రమాదం ఉంది. ఫోన్ బ్యాటరీ కెపాసిటీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న చార్జర్‌‌తో ఛార్జ్ చేయడం వల్ల ఫోను ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దీని వల్ల చార్జర్ వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఫోన్కు మాత్రం ఏ సమస్య ఉండదు. 

స్మార్ట్ ఫోన్ల కంటే ట్యాబ్లెట్లలో ఉండే బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ. కాబట్టి వేగంగా చార్జ్ అయ్యేందుకు వీలుగా వాటి చార్జర్ల కెపాసిటీ కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే వాటి చార్జర్లు ఫోన్కు వాడకపోవడం మంచిది అంతేకాకుండా కంప్యూటర్ యూఎస్‌బీ పోర్ట్లో కేబుల్ పెట్టి చార్జింగ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ చాలా లేట్గా చార్జ్ అవుతుంది.

ALSO READ | Tool gadgets : ప్రెజర్ చెక్

కొందరు మామూలు ఫోన్కు కూడా ఫాస్ట్ చార్జర్‌‌తో చార్జింగ్ పెడుతుంటారు. కానీ అది చాలా ప్రమాదకరం. కొన్ని రకాల బ్రాండెడ్ ఫోన్లు చాలా వరకూ మార్కెట్లో ఉన్న ఫోన్లకు ఈ చార్జర్లను తట్టుకునే సామర్థ్యం ఉండదు. మొబైల్స్ ప్రాసెసర్లలో టామ్లో ఉన్న క్వల్, కామ్' కిక్ చార్జింగ్కు అనువైన చిప్లను మొబైల్ మార్కెట్‌కు అందిస్తోంది. కాకపోతే మొబైల్ క్విక్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తే ఏ ఫాస్ట్ చార్జర్ అయినా వాడుకోవచ్చు. 

కానీ సాధారణ మొబైల్స్‌కు ఫాస్ట్, టర్బో చార్జర్లు వాడడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. అందుకే క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేయని మొబైల్స్కు అత్యవసర పరిస్థితుల్లో తప్ప క్విక్ చార్జర్ ఉపయోగించకూడదు. సాధారణంగా ఫాస్ట్ చార్జలతో చార్జ్ చేసేటప్పుడు మొబైల్ బ్యాటరీ వేడెక్కితే వెంటనే చార్జర్ను ఆన్ ప్లగ్ చేయాలి. లేదంటే బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. అందుకే ఇతర చార్జర్లను ఉ యోగించొద్దని కొన్ని కంపెనీలు తమ కస్టమర్లకు సూచిస్తున్నాయి.