ఇకపై ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కోసం ఎయిర్పోర్టులో గంటల తరబడి వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పడనుంది.. క్షణాల్లో ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అందించేలా ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ను ప్రారంభించింది ప్రభుత్వం. బుధవారం ( జనవరి 16, 2025 ) హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ సేవలు ప్రారంభించింది ప్రభుత్వం. ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం పేరిట ఈ సర్వీస్ ను లాంచ్ చేసింది ప్రభుత్వం. ఫాస్ట్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ద్వారా ఓవర్సీస్ సిటిజన్స్, ఇండియాన్ పాస్ పోర్ట్ హోల్డర్స్ కి వేగంగా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ అందనుంది.
అర్హత కలిగిన ప్రయాణికులందరికీ ఈ సర్వీస్ అందించి ప్రయాణాన్ని వేగంగా సురక్షితంగా మార్చటమే తమ ధ్యేయమని.. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి:
- ఈ సర్వీస్ కోసం ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ కోసం ఒక నెల సమయం పడుతుంది.
- కనీసం 6 నెలల పాస్ పోర్ట్ వ్యాలిడిటీ ఉన్నవారే ఇందుకు అర్హులు.
- ఈ మెంబర్షిప్ పాస్ పోర్ట్ వ్యాలిడిటీ ఉన్నంతవరకు ఉంటుంది.
ఈ ప్రోగ్రాం వల్ల ప్రయోజనాలు:
- ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ వల్ల ఎయిర్ పోర్టులో రద్దీ తగ్గనుంది.
- ఈ సర్వీస్ కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఎలక్ట్రానిక్ గేట్స్ ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో డిమాండ్ ని బట్టి గేట్స్ సంఖ్య పెంచుతామని తెలిపింది హైదరాబాద్ ఎయిర్ పోర్ట్.
The Modi govt is committed to making international travel easier and hassle-free for our citizens and OCI cardholders. Under this vision, today launched the 'Fast Track Immigration-Trusted Traveller Program' (FTI-TTP) for Mumbai, Chennai, Kolkata, Bengaluru, Hyderabad, Cochin and… pic.twitter.com/5FDlbedbaO
— Amit Shah (@AmitShah) January 16, 2025