FASTag కేవైసీ గడువు పొడగింపు..ఫిబ్రవరి 28 లాస్ట్ డేట్

FASTag కేవైసీ గడువు పొడగింపు..ఫిబ్రవరి 28 లాస్ట్ డేట్

FASTag గురించి మనందరికి తెలిసిందే. ఇది హేవేలు, టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లించే ఈ ఫాస్టాగ్ KYC  అప్ డేట్ చేసేందుకు గడువును పెంచారు. జనవరి 31 వరకు ఉన్న గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్ తో ఫాస్టాగ్ ల దుర్వినియోగాన్ని  నిరోధించేందుకు ప్రతి వాహనం వన్ ఫాస్టాగ్ ఉండేలా గడువు లోపు తప్పనిసరిగా ఫాస్టాగ్ కేవైసీని అప్డేట్ చేసుకోవాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) తెలిపింది. దీనిని కేవైసీ అప్ డేట్ చేసేందుకు IHMCL కస్టమర్ పోర్టల్ లోకి సంప్రదించాలి.

ఫాస్టాగ్ అనేది రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) పరికరం. ఇది టోల్ గేట్ల వద్ద డైరెక్టుగా వాలెట్ల నుంచి లేదా లింక్ చేయబడిన బ్యాంకులనుంచి  టోల్ చెల్లింపులు చేస్తుంది. ఇది టోల్ ప్లాజాలు, హైవేలపై ఆటోమేటిక్ టోల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. 

FASTag లో KYC ఎలా అప్ డేట్ చేయాలంటే.. 

 IHMCL కస్టమర్ పోర్టల్ లో My Profile  ఓపెన్ చేయాలి. అందులో KYC పై క్లిక్ చేసి Customer Type  ని ఎంచుకోవాలి.అవసరమైన ఐడీ ఫ్రూఫ్ , అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లతో ఇచ్చిన ఫీల్డ్ లను పూర్తి చేయాలి. పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అప్ లోడ్ చేసి  అడ్రస్ ప్రూఫ్ కింద చిరునామా వివరాలు ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్ల ధృవీకరణ తర్వాత FASTag  KYC పూర్తవుతుంది.