
అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం–హైదరాబాద్ రూట్లో మన్ననూర్, దోమలపెంట వద్ద ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద గురువారం నుంచి ఫాస్టాగ్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎఫ్డీవో విశాల్ తెలిపారు. మన్ననూర్ ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న చెక్ పోస్ట్ ను మృగవని రిసార్ట్ వద్దకు మార్చామని, ఫాస్టాగ్ ద్వారా టికెట్ జారీ చేస్తామని చెప్పారు. బైక్, కారు, జీప్ లకురూ.50 చొప్పున, ప్రైవేట్ బస్సులు, ట్రక్కులకు రూ.80 చొప్పున పర్యావరణ నిర్వహణ చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.