కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరగడంతో.. అదికారులే కాదూ సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాజిటివ్ కేసులు పెరగుతుండటంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో వార్డులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. పది హేను రోజుల్లోనే ఆరుగురికి పాజిటివ్ వచ్చాయి. హన్మకొండకు చెందిన వైద్యుడు, ఆయన కుమారుడికి పాజిటివ్ రావటంతో అతన్ని హాస్పిటల్ లో చేర్పిం చారు. కరీంగనర్ జిల్లా జమ్మికుంట కు చెందిన కిరణాంషాపు వ్యాపారీ, ఖాజీపేటకు చెందిన పేపర్ ప్లేట్స్ అమ్మే వ్యాపారీ, ములుగు జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ , వరంగల్ రూరల్ జిల్లా చెన్నరావుపేట వాసికి కరోనా పాజిటివ్ రావటంతో ..వారికి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేసే ఏఎన్ఎమ్ కు కరోనా పరిక్షలు నిర్వహించారు. అందులో అమెకు పాజటివ్ రావటంతో ఎంజీఎంలో చేర్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నామని చెబుతున్నారు డాక్టర్లు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా పాజిటవ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో అదికారులే కాదూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.