ఉపవాసం ఉంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..

ఉపవాసం ఉంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..

ఉపవాసం మనదేశంలో చాలా కామన్. దేవుడి కోసమో, హెల్త్ కోసమో ఉపవాసం అదే ఒక్కపొద్దు ఉంటే మంచిదని అనుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఇదే ఉపవాసం ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతోంది. బరువు తగ్గడం కోసం ఉపవాసమే కరెక్ట్ సొల్యూషన్ అంటున్నారు డైట్ నిపుణులు. దీన్నే 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' అంటారు.

ఇం టర్కిటెంట్ అంటే అడపాదడపా అర్ధం. .అంటే.. అప్పుడప్పుడు ఉపవాసాలు చేస్తూ ఆరోగ్యంగా ఉండడమే ఈ డైట్ ఫార్ములా అన్నమాట. గతంలో ట్విటర్ సీఈఓ గా పని చేసిన జాక్ డోర్స్. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తానని చెప్పారు. అంటే ఆయన ఇంటర్కిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నాడా' అని చాలామందికి డౌట్ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా దీని గురించి పెద్ద చర్చే జరిగింది. అంతేకాకుండా ఈ డైట్ చాలా పాపులర్ డైట్ అని 'ఇంటర్నేషనల్ ఫుడ్ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ ఫౌండేషన్ (IFIC) సర్వే కూడా చెస్తోంది.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే..?

ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అంటే.. రోజులో చాలా గంటలపాటు తిండి తినకుండా ఉండి, కేవలం కొన్ని గంటల్లోనే రోజుకు సరిపడినంత ఫుడ్ తీసుకోవడం. దీని వల్ల శరీరం ఇన్సులినన్ను బాగా ఉపయోగించుకుంటుంది. తద్వారా రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండి, టైప్ 2 డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ఈ డైట్ లో ఏం తింటున్నాం అనేదానికన్నా.. ఏ సమయంలో తింటున్నాం అన్నది ముఖ్యం. ఈ డైట్ తో శరీరం బ్యాలెన్స్ గా ఉండడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. ఇలా ఈ డైట్ వల్ల చాలానే ఉపయోగాలున్నాయి.  ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో మూడు పద్ధతులు ఉంటాయి.   అందులో ..

మొదటిది 5:2 పద్దతి...ఈపద్దతిలో ఉపవాసం అంటే  వారంలో రెండు రోజులు, సాధారణంగా తీసుకునే కేలరీల్లో కేవలం 25% మాత్రమే తీసుకోవాలి. మిగిలిన ఐదు రోజుల్లో ఎలాంటి రూల్స్ ఉండవు. అయితే, తక్కువ కేలరీలు తీసుకునే అరెండు రోజులు కూడా వరుసగా ఉండకూడదు. ఇది 5:2 పద్దతి. 

 ఇక రెండోది 16:8... ఈ పద్ధతిలో ఒక రోజులో తీసుకోవాలనుకున్న ఆహారం 8 గంటల్లో ముగించి, మిగిలిన 16 గంటలు ఉపవాసం ఉండాలి.

ఇక మూడో పద్ధతిలో వారానికి లేదా నెలకు ఒకరోజు అంటే 24 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా ప్రతీ డైట్ లో భోజనానికి, భోజనానికి మధ్య పర్టిక్యులర్ గ్యాప్ ఇచ్చి, ఆహారాన్ని మితంగా తీసుకోవాలి.

ఎప్పటి నుంచో ఉంది

ఉపవాసం మనిషి శరీరానికి కొత్త విషయమేమీ కాదు ఇది ఎప్పటినుంచో మనిషిలైఫ్ స్టెల్లో భాగమైపోయింది. అన్ని విషయాలతో పాటే తినడంలోనూ క్రమశిక్షణ అవసరం. దానికోసమే పూర్వీకులు ఉపవాసాన్ని కనిపెట్టి ఉంటారని నిపుణులు అంటున్నారు. ఇది శరీరాన్ని ఒక క్రమపద్ధతిలో
పని చేసేలా చేసి దాని ద్వారా మంచి ఫలితాలనిస్తుంది.

అన్నింటిలా కాదు

ఈ ఫాస్టింగ్ ఇతర డైటింగ్ విధానాల్లాగా కొవ్వు పదార్ధాలు, కార్బోహైడ్రేట్స్ ఒక క్రమ పద్దతిలో తినాలి. ఈ డైట్ లో చేయాల్సిందల్లా కేవలం... సమయాన్ని పాటించడమే. అలాగని ఒకరోజు విందుభోజనం, మరొకరోజు ఆకలితో అలమటించడం కూడా కాదు. అలా చేసినా ఫలితం ఉండదు. టైంని స్టిక్ట్ గా ఫాలో అవుతూ ఆహారం తీసుకోవాలి. అదికూడా. పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే బెటర్. ఈ డైట్ తీసుకునేవాళ్లు చేప నూనె, గింజలు, విత్తనాలు, ధాన్యాలు, కొవ్వుశాతం తక్కువగా ఉన్న ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువగా లభించే పళ్లు, కూరగాయలు, విటమిన్స్, మినరల్స్ తీసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

డయాబెటిస్ కు  మందు

ప్రపంచ వ్యాప్తంగా చాలామంది టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించుకోకపోతే టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఎక్కువ బరువు, థైరాయిడ్, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, వేళకు భోజనం చేయకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, వ్యాయామం చేయకపోవడం... వంటి కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.

 జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చు. అందుకే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు ఇంటర్కిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుని, దానిద్వారా డయాబెటిస్ ను అదుపు చేయొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

లాభాలివి

  • ఈ తరహా ఉపవాసం వల్ల వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావట. ఎందుకంటే ఉపవాసంలో ఉన్నప్పుడు మన శరీరం కొత్త కణాలను నిర్మించుకోవడంతోపాటు, పాత కణాలకు మరమ్మత్తులు చేసుకుంటుంది. ఇది యాంటీ ఏజింగ్ ప్రభావాన్ని కలిగిస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. 
  • ఉపవాసం వల్ల మెదడు పనితీరు బాగా పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఎల్లప్పుడూ యాక్టివ్ కూడా ఉంటారు. 
  • ఉపవాసం చేస్తే శరీర రోగ నిరోధక శక్తిపెరుగుతుంది.  దగ్గు, జలుబు లాంటిచిన్నచిన్న సమస్యలు నయమవుతాయి. 
  • అప్పుడప్పుడు ఉపవాసం చేస్తే క్యాన్సర్ కూడా నయమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఉపవాసం వల్ల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.
  • కనీసం వారానికి లేదా నెలకు ఒకసారి.. ఉపవాసం ఉండటం వల్ల శరీరానికి చాలా మంచిదని, ఇతర మందులు వాడటం కంటే..ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల చాలా ప్రయోజనకరమని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • ఆరోగ్యాన్ని బట్టి.. ఎన్ని రోజులకు ఒకసారి ఉపవాసం మంచిది అనేది డిసైడ్ అయి ఉంటుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
  • వారానికి ఒకరోజు ఉపవాసం ఉండటం వల్ల.. బరువు తగ్గడంలో శరీరం పాజిటివ్ గా స్పందిస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో పేరుకున్న ఫ్యాటి ని శరీరం ఉపయోగించుకుని.. ఎనర్జీ ఇస్తుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.
  • ఫాస్టింగ్ వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి. మెదడు పనితీరుకి ఉపవాసం సరైన ఔషధం. దీనివల్ల మెదడు కణాలు మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
  • ఉపవాసం న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనే ప్రొటీన్స్ ని ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇవి బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యానికి సహాయపడతాయి. 
  • వారానికి లేదా నెలకు ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. అలాగే సెల్ డ్యామేజ్ అవకుండా అడ్డుకుంటుంది.
  • చర్మ సమస్యలకు.. శరీరంలో పేరుకున్న మలినాలే కారణం. వీటివల్ల మొటిమలు ఎక్కువగా వస్తాయి. ఉపవాసం శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. అందుకే ఉపవాసం వల్ల క్లియర్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ వస్తుంది. చర్మం యంగ్ గా కనిపించేలా చేస్తుంది.

సైడ్ ఎఫెక్ట్స్

ఈ డైట్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్  వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  మొదట్లో శరీరం ఈ తరహా ఆహార విధానాన్ని అలవాటు చేసుకోడానికి అడ్జస్ట్ కాకపోవచ్చు. అందుకే చాలామంది ఈ డైట్ ను మధ్యలోనే ఆపేస్తారు. అలా కాకుండా డైట్ను ఫాలో అయ్యే ముందు డాక్టర్ ని సంప్రదించి డెసిషన్ తీసుకుంటే మంచిది. ఈ డైట్ పాటిస్తూ ఎక్సర్ సైజ్ చేస్తే మొదట్లో ఇబ్బంది పెట్టినా, అడ్జస్ట్ మెంట్ పీరియడ్ తర్వాత అంతా సర్దుకుంటుంది. అందుకే డైట్ ఫాలో అయ్యే వాళ్లు ముందు ఇబ్బందిగా ఉన్న రెగ్యులర్ వర్కవుటిని విడిచిపెట్టకూడదు.

అందరికీ కాదు

ఇకపోతే ఈ డైట్ అందరికీ అంత మంచిది కాదు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు. గర్భిణీలు, డయాబెటిస్,  బీపీ సమస్య ఉన్న వాళ్లు, ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవాళ్లు, తక్కువ బరువు ఉన్నవాళ్లు ఈ  డైట్ ఫాలో అయ్యే ముందు డాక్టరు సంప్రదిస్తేనే మంచిది. కడుపులో అల్సర్ ఉన్నవారు ఉపవాసమే చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.