Good Health:  ఇలా ఆడుకుంటూ కొవ్వును కరిగించుకోండి.... గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

Good Health:  ఇలా ఆడుకుంటూ కొవ్వును కరిగించుకోండి.... గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

నోటికి రుచిగా ఉంది కదా అని దొరికిందల్లా.. కడుపులో పడేస్తాం. చేసే ఉద్యోగాలేమో... కడుపులో సల్ల కదలకుండా కుర్చీలో కూర్చొని చేసేవేనాయె. ఇక శారీరక శ్రమ ఎక్కడిది? దీంతో.. ఒంట్లో ఎక్కడ పడితే అక్కడ కొవ్వు పేరుకుపోతుంది. దాన్ని కరిగించుకునేందుకు పొద్దున్నే లేచి.. నాలుగడుగులు వేసే ఓపిక, తీరిక, టైమ్ కూడా  ఉండవాయె.   ఇప్పుడెలా గుట్టలు.. గుట్టలుగా పేరుకుపోతున్న కొవ్వును ఎలా కరిగించాలి ?

అందరి శరీరతత్వాలు ఒకేలా  ఉండవు. కొంతమంది లావుగా ఉన్నా, హుషారుగా, చురుగ్గా కదులుతుంటారు. అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొంటారు. కొందరు అలా కాదు. ఇక బక్కగా ఉన్న వాళ్ల విషయానికొస్తే శరీరం ఏ వైపు వంచాలన్నా ఈజీగా ముగిపోతుందేమా అనుకునేలా ఉంటుంది వారి బాడీ. కానీ నిజానికి వాళ్లు చాలా అలసటగా, బద్దకంగా కనిపిస్తుంటారు. దీనికి కారణం వారి వారి శరీర తత్వాలు, వారి బలాబలాలు అయితే వారూ వీరూ.. అనే తేడా లేకుండా... ఆరోగ్యంగా ఉండాలంటే పర్కవుట్లు చేయడమే మొదటి మార్గమని అందరికీ ఒకేలా సూచిస్తుంటారు. హెల్త్ కౌన్సిలరు .  కానీ...  అన్ని సమయాల్లో, అందరి విషయాల్లో అది కరెక్టు కాదు. మరేం చేయాలి.?

తాడాట.... 

చిన్నప్పుడు తాడాట (స్క్రిప్పింగ్) ఆడనివాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే.. 90వ దశకంలో పుట్టిన వారందరికీ తాడాట సుపరిచితమే. ఇదొక ఫిజికల్ ఎక్సర్ సైజ్ లా అస్సలు  అనిపించదు. పోటీ పెట్టుకొని మరీ ఆటలా ఈ వర్కవుట్ చేస్తారు. మనకు తెలియకుండానే. ....స్కిప్పింగ్​ తో  శరీరానికి ఓ హుషారు వస్తుంది. ఎన్నో కేలరీలు కరిగిపోతాయి.కొవ్వును కరిగించడంలో శరీరంలోని ప్రతి కండరాన్ని కదిలించే స్కిప్పింగ్ బెస్ట్ కేలరీ బర్న్ ఇండోర్ వర్కవుట్.. రోజుకు 50 స్కిప్స్​ చేస్తే మెటబాలిజం మెరుగుపడుతుంది. నిమిషానికి ఐదు కేలరీలు ఖర్చవుతాయి. నిమిషంలో వంద స్కిప్స్​  చేయగలిగితే.... 13 కేలరీలు ఖర్చయి శరీరం చాలా చురుగ్గా ఉంటుంది.

స్టెప్పేస్తే....

దుమ్ము రేపే మ్యూజిక్​ కి ఒళ్లు మరిచి నాలుగు స్టెప్పులేస్తే, బాడీ అంతా చెమటతో తడిసిపోతుంది....అంతే కదా....  ఈ అనుభవం ఎక్కువ మందికి తెలిసి ఉంటుంది. డ్యాన్స్ చేస్తుంటే .....  చాలామంది ఈ లోకాన్నే మరిచిపోతారు. స్టెప్పులేస్తున్న కొద్దీ ఏదో నూతన ఉత్సాహం అవహించినట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం  ఒంట్లోని కొవ్వు కరిగిపోయి.. శరీరంలోని వ్యర్థాలు చెమట రూపంలో బయటకు వెల్లిపోవడమే. చెత్తంతా బయటకు వెళ్లిపోయాక.. బాడీ. యాక్టివ్ గా , చురుగ్గా ఉండకపోతే ఇంకెలా ఉంటుంది. ఇంట్లోనే. మీకు నచ్చిన పాట, మ్యూజిక్ ప్లేచేస్తూ ఒళ్లు అలసిపోయేలా స్టెప్పులేయండి.కొవ్వు మీ శరీరాన్ని వదిలి పారిపోతుంది.

బాటిల్​ రోప్స్​

ఆ మధ్య ఓ సినిమాలో లుక్ కోసం సమంతా రోప్స్ వర్కవుట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇండోర్ లో చేసే ఈ వర్కవుట్.. గుండెకు చాలా మేలు చేస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగించి బాడీని ఫిట్​ గా ఉంచుతుంది. భుజాల్లోని కొవ్వును కరిగించి కండరాలను దృఢపరుస్తుంది. ఈ వర్కవుట్ చేసేటప్పుడు వంగి ఉండడం వల్ల నడుము, పిక్కలు, తొడలు స్ట్రాంగ్ అవుతాయి. కాకపోతే... ఈ వర్కవుట్ చేయాలంటే..బాటిల్ రోప్స్ బరువు మీశరీర బరువుకు మూడురెట్లు ఎక్కువ ఉండాలి.

బరువు మోస్తూ..

మీరు చాలా సార్లు గమనించే ఉంటారు. ట్రెక్కింగ్ చేసేవారు చాలా ఫిట్ గా, స్ట్రాంగ్ గా  ఉంటారు. దీనికి కారణమేంలో ఎప్పుడైనా ఆలోచించారా? భుజాల మీద బరువుతో ఎత్తైన కొండలు ఎక్కడమే వారి సీక్రెట్​.  ఎత్తు ఎక్కుతున్నప్పుడు ఆటోమేటిక్​ గా శరీరం ముందుకు వంగుతుంది.  ఆ సమయంలో  భుజాల మీద బరువు ఉంచడం వల్ల కండరాల మీద ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడిని భరిస్తూ ముందుకు సాగిపోతే క్రమంగా శరీరం అలవాటు పడిపోతుంది. ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే.. శరీరం మనకు తెలియకుండానే ఆ ఒత్తిడిని భరించే శక్తిని  సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో ఒంట్లో కొవ్వంతా కరిగిపోయి.. బాడీ ఫిట్ గా మారుతుంది. అయితే అందరూ ట్రెక్కింగ్ చేయలేరు. అలాంటి వారు భుజాల మీద బరువు మోస్తూ ఇంట్లో మెట్లు ఎక్కితే చాలు...

బర్పీస్.. 

చాలా ఈజీగా ఇంట్లోనే చేయగల వర్కవుట్ ఇది. గుండెను కంటికి రెప్పలా కాపాడు కోవాలనుకుంటే. ...ఈ ఎక్సర్సైజ్ ప్రతిరోజూ చేయాలి .  ఇది ఎలా చేయాలంటే ముందుగా అరచేతులు నేలకు ఆన్చి వంగినట్టుగా కూర్చోవాలి. ఆ తర్వాత రెండు వాళ్లు సమాంతరంగా వెనక్కి చాపి చేతుల మీద గాలిలో ఉండాలి. గాలి పీల్చుతూ ఒక పుషప్​ చేయాలి. మళ్లీ తిరిగి ఒకదాని తర్వాత ఒకటి రెండు కాళ్లు ముందుకు తెస్తూ.. అరచేతుల మీద మొదట్లో కూర్చున్నట్టుగా కూర్చోవాలి .  ఇప్పుడు చేతులు గాల్లోకి లేపుతూ... ఒక జంప్ చేయాలి. ఇలా కంటిన్యూగా పదిసార్లు చేస్తే తొడల,  నడుము, భుజాల భాగాల్లో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. అంతేకాదు.. వెన్నెముక ధృడపడుతుంది.

–వెలుగు, లైఫ్​–