హైదరాబాద్ బాచుపల్లిలో ఘోర ప్రమాదం.. బీటెక్ స్టూడెంట్ స్పాట్ డెడ్

హైదరాబాద్ బాచుపల్లిలో ఘోర ప్రమాదం.. బీటెక్ స్టూడెంట్ స్పాట్ డెడ్

హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బాచుపల్లి మియాపూర్ హైవేపై ఈ యాక్సిడెంట్ జరిగింది.

వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి బీటెక్ విద్యార్థి కేతావత్ నాను, స్నేహితుడితో బైక్ పై వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు  అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

ప్రమాద స్థలంలో ఉన్న పలువురు వాహనదారులు గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.