జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ, రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీ..

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం..  లారీ, రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీ..

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉండవల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర లారీ, రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి.  బండలతో వెళ్తున్న లారీ యూ టర్న్ చేసుకుంటుండగా  హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న సిజిఆర్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అదే సమయంలో ఆ వెనక నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి  వెళ్తున్న మరో కావేరి ట్రావెల్స్ బస్సు ఢీట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 

ఈ ప్రమాదంలో తిరుపతి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ఉన్న 40 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. డ్రైవర్ కాలు విరిగడంతో పరిస్థితి విషమం ఉంది. గాయపడిన వారందరినీ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడప వెళ్తున్న సిజిఆర్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమచారం తెలియాల్సి ఉంది.