సూర్యాపేట జిల్లా బీబీ గూడెం వద్ద ఘోర ప్రమాదం.. బస్సు- కారు ఢీకొని ముగ్గురు స్పాట్ డెడ్

సూర్యాపేట జిల్లా బీబీ గూడెం వద్ద ఘోర ప్రమాదం.. బస్సు- కారు ఢీకొని ముగ్గురు స్పాట్ డెడ్

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చివ్వెంల మండంలోని బీబీగూడెం వద్ద ఆర్టీసీ బస్సు-, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కకడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. 

ALSO READ | శ్రీశైలం ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్.. భక్తుల తీవ్ర ఇబ్బందులు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. మృతుల శరీర భాగాలు చిధ్రం కావటంతో ఘటన స్థలంగా భయానకంగా మారింది. మృతులను ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గడ్డం రవీందర్ అతడి భార్య రేణుక, కూతురు రితిక (8)గా గుర్తించారు. మృతులను మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని కంఠాయపాలెం వాసులుగా గుర్తించారు పోలీసులు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.