ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారి పాలెంలో అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీ కొన్నాయి. ఈ  ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్, టిప్పర్ లారీ డ్రైవర్ తో సహా ఆరుగురు సజీవదహనం అయ్యారు. పలువురికి తీవ్రగాయలయ్యాయి. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డెడ్ బాడీలను రికవరీ చేశారు. గాయాలైన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. బస్సులో చినగంజం, గోనసపూడి, నీలాయపాలెం వాసులు ప్రయాణిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఓటు వేసి హైదరాబాద్ కు వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది.  ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తామని ఏపీ పోలీసులు తెలిపారు.