అశ్వాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్​ మృతి.. 20 మందికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జులై 7 అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం.. వరంగల్​నుంచి గుంటూరు కు రాత్రి ఓ ఆర్టీసీ బస్సు బయల్దేరింది. మణుగూరు మీదుగా వెళ్తున్న ఆ బస్సు అశ్వాపురం సమీపానికి రాగానే లారీ బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.  

ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులు స్వల్ప  గాయాలు అయ్యాయి. బస్సులోని ఇద్దరు డ్రైవర్లలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. లారీ డ్రైవర్​కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.