
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావ్ పేట గేటు దగ్గర నేషనల్ హైవే 765 డీ మీద ఆదివారం అర్థ రాత్రి హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆల్టో కారు ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. మృతులను ఎం.డి. గౌస్, అలీ, అజీమ్ బేగంగా గుర్తించారు. ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు కాగా.. చికిత్స కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఐలాబాద్ గ్రామ సమీపంలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, ఆటో ఢీకొని ఆటో డ్రైవర్ నాగరాజు 48 మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ స్టేజి వద్ద కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు రేగాయి. వెంటనే రోడ్డు పక్కన కారు ఆపి దిగడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. పఠాన్ చెర్వు నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.