నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే వ్యక్తి మృతి..

నల్లగొండ జిల్లాలో ఘోర  ప్రమాదం జరిగింది. కారు బైకును ఢీకొట్టడంతో వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే నార్కెట్ పల్లి మండలం గోపలాయిపల్లి వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అటుగా వస్తున్న బైకును వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు. స్థానికులు యాక్సిడెంట్ గురించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామానికి చెందిన ఐతరాజు ముత్తిలింగంగా గుర్తించారు. బాడీ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.