![పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్](https://static.v6velugu.com/uploads/2024/12/fatal-road-accident-in-palnadu-district-four-dead-on-the-spot_DsR7GTl39q.jpg)
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (డిసెంబర్ 8) తెల్లవారుజూమున అతి వేగంగా దూసుకెళ్లిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న వారిలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారి డెడ్ బాడీలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.