ఎదురెదురుగా ఢీకొన్న లారీ, బస్సు.. ఐదుగురు స్పాట్ డెడ్

ఎదురెదురుగా ఢీకొన్న లారీ, బస్సు.. ఐదుగురు స్పాట్ డెడ్

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని కెజి కండిగైలో బస్, టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్ ‎లోని ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కకడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుల వివరాలను ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై లోతుగా ఆరా తీస్తున్నామని తిరుత్తణి పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటన స్థలం భయానకంగా మారింది.