తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్..

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లాలో చంద్రగిరి మండలం ఎం. కొంగరవారిపల్లి వద్ద జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

 డెడ్ బాడీలను రికవరీ చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.