ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.  రాయ్‌బరేలి నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్‌ డెక్కర్‌ బస్సు లక్నో- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై వెళ్తున్న క్రమంలో  ఇటావా వద్ద కంట్రోల్ కోల్పోయి కారును ఢీకొందని పోలీసులు తెలిపారు. దీంతో ఏడుగురు స్పాట్ లో మృతిచెందారని..  మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయకచర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. 

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రమాదం జరిగినట్టు ఎస్పీ సంజయ్‌ కుమార్‌ వర్మ తెలిపారు. మృతుల్లో నలుగురు బస్సులోని ప్రయాణికులు, ముగ్గురు కారులోని ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. కారు డ్రైవర్‌ నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు.