ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు డాక్టర్లు మృతి

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు డాక్టర్లు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నౌజ్ జిల్లాలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డారని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. తిర్వా కొత్వాలి ప్రాంతంలోని 196 కిలోమీటర్ల మార్క్ సమీపంలో బుధవారం తెల్లవారుజూమున ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

 కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో కారు అదుపు తప్పి డివైడర్‎ను ఢీకొట్టి ఎదురుగా వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.. మరో వ్యక్తి గాయపడ్డాడు. మరించిన వారిలో ఐదుగురు వైద్యులు ఉన్నారు.  మృతులు సైఫాయ్ మెడికల్ కాలేజీకి చెందిన వారిని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు.