టీఆర్ఎస్ గెలిస్తేనే మునుగోడు అభివృద్ధి

టీఆర్ఎస్ గెలిస్తేనే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా  ఎడారి గా మారుతుందని ఆనాడు అందరూ అనుకునేవారని.. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే ఇప్పుడు ఇక్కడి పరిస్థితి మారిందని ఆయన పేర్కొన్నారు. ఫ్లోరైడ్  రక్కసి భయంతో  మునుగోడు నుంచి గతంలో వలస వెళ్లిపోయిన వారంతా .. మళ్లీ తిరిగొచ్చారని తెలిపారు. మునుగోడులో జరుగుతున్న టీఆర్ఎస్ బహిరంగ సభలో జగదీశ్ రెడ్డి మాట్లాడారు.

ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి అవసరమైన కోట్లాది రూపాయల నిధులను ఉదారంగా మంజూరు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.  ‘‘ ఫ్లోరైడ్ సమస్య దేవుడిచ్చిన శాపం కాదు.. పాలకులు చేసిన ద్రోహం’’ అని దాదాపు రెండు దశాబ్దాల క్రితమే కేసీఆర్ తనతో చెప్పారని జగదీశ్ రెడ్డి ఈసందర్భంగా గుర్తుచేసుకున్నారు. మాటలు చెప్పడమే కాదు.. వాటిని ఆచరించి చూపిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.