ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మధిర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీ కొని తండ్రికూతుళ్లు మృతి చెందారు. రైలు పట్టాలు దాటుతుండగా నవజీవన్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు..మృతులు తండ్రి మల్లారానికి చెందిన కొంగర కేశవరావు, ఖమ్మంపాడుకు చెందిన కూతురు నూకారాపు సరితగా గుర్తించారు . విజయవాడ ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా..మధిరలో ఇంటర్సిటీ దిగి రైల్వే పట్టాలు దాటుతుండగా నవజీవన్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.