తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల వరద ఉదృతికి ప్రాణాలు కోల్పోతున్నారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వరదలకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి దగ్గర తండ్రికూతురు కారుతో సహా ఆకేరు వాగులో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో సమీపంలోని పామాయిల్ తోటలో కూతురు అశ్విని డెడ్ బాడీ లభ్యం అయ్యింది. తండ్రి మోతీలాల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఖమ్మం జిల్లా గంగారం తండాకు చెందిన తండ్రి కూతురు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తాము ప్రమాదంలో ఉన్నామని చివరి సారి కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ | మున్నేరు వాగు ఉగ్రరూపం..వరదల్లో చిక్కుకున్న ముగ్గురు యువకులు