బైక్ ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు..తండ్రీ కొడుకులు దుర్మరణం

వరంగల్ హన్మకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కల గుట్ట వద్ద  ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీ కొట్టింది.  ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న తండ్రీ కొడుకులు మృతి చెందారు. మృతులను అంబేద్కర్ నగర్ కు చెందిన సంజీవ్ అతని కుమారుడు రూపేష్ గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు. తండ్రి, కొడుకు మరణించడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

24 గంటల్లో 37,975 కేసులు.. 480 మరణాలు

సరదాకి వెళ్లి.. డబ్బింగ్ స్టార్ అయ్యింది