
జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి.. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో ఉన్న హుడా పార్క్ చెరువు శుభ్రం చేస్తూ ఇద్దరు అవుట్ సోర్సింగ్ సిబ్బంది మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు తండ్రి, కొడుకులు కావడం గమనార్హం. బుధవారం ( ఫిబ్రవరి 26 ) చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. లంగర్ హౌస్ లోని హుడా పార్క్ లో చెరువు శుభ్రం చేసేందుకు వెళ్ళాడు మహమ్మద్ కరీం. శివరాత్రి సందర్భంగా 15ఏళ్ళ తన కుమారుడు సాహిల్ ని వెంటబెట్టుకొని వెళ్ళాడు కరీం.
చెరువులోని గడ్డిని శుభ్రం చేసే క్రమంలో క్రమంలో సాహిల్ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ బరదలో ఇరుక్కుపోయాడు. తన
బురదలో ఇరుక్కుపోయిన సాహిల్ తండ్రిని సహాయం కోరడంతో కరీం సాహిల్ ను కాపాడే ప్రయత్నం చేశాడు. కొడుకును కాపాడే క్రమంలో కరీం కూడా బురదలో ఇరుక్కున్నాడు. అలా ఇద్దరు నీళ్లలో లోతుగా తుడుచుకుపోయిన బురదలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన ఇతర ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ ఎండమాలజీ సూపర్వైజర్ కి సమాచారం అందించారు.
సూపర్వైజర్ ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దిన్ దీనికి సమాచారం ఇవ్వగా.. ఎమ్మెల్యే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి సమాచారం ఇవ్వడంతో అరగంట వ్యవధిలో డిఆర్ఎఫ్ టీం ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు మృతదేహాలని వెలికి తీశారు.
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కౌసర్ మోయుద్దిన్.. గత కొంతకాలం నుంచి జిహెచ్ఎంసీ కమిషనర్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ తో ఎఫ్టిఎల్ మెషిన్ గురించి ఎన్నోసార్లు అడిగామని.. కానీ కమిషనర్ ఎదో ఒక చెప్పి ఎఫ్.టి.ఎల్ మెషిన్ ని అలర్ట్ చేయలేదని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా కనీసం లైఫ్ జాకెట్స్ లు కూడా ఇవ్వకపోవడంతో ఈరోజు ఇలా సంఘటన జరిగిందని అన్నారు ఎమ్మెల్యే.
ఈ దుర్ఘటననికి సంబంధించి పార్టీ తరఫున గవర్నమెంట్ మరియు జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వచ్చేలా ప్రయత్నిస్తామని అన్నారు ఎమ్మెల్యే. ఎంటమాలజీ సూపర్వైజర్ 15 సంవత్సరాల అబ్బాయికి ఈ పనికి వెళ్లేందుకు పర్మిషన్ ఎలా ఇస్తారని.. సూపర్వైజర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.