తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కొడుకు కత్తితో పొడిచి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే..

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం హనుమంతుని పేట గ్రామానికి చెందిన ఓదెలు(55) అనే వ్యక్తిని అతని కొడుకు రాజు అతి కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చాడు.  ఓదెలు మద్యనికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో కుటుంబంలో కలహాలు చెలరేగాయి. ఓదెలుకు అతని భార్య, కొడుకు ఎంత చెప్పినా వినకపోవడంతో  శుక్రవారం(ఫిబ్రవరి 16) రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. దీంతో రాజు కత్తితో తన తండ్రిపై కిరాతకంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఓదెలు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.