విద్యుత్ షాక్తో తండ్రీ కొడుకులు మృతి..

మంచిర్యాల జిల్లా కేంద్రంలో  ఒకేసారి తండ్రీకొడుకుల మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. దండెంపై బట్టలారేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి తండ్రీకొడుకులు మృతి చెందారు.దీంతో మృతుల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి.  వివరాల్లోకి వెళితే.. 
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంపీసీ సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్లలో ఎడ్ల రాజేందర్, అతని కుమారుడు అరుణ్ కుమాఱ్ నివాసముంటున్నారు. రాజేందర్ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తుండగా.. అరుణ్ కుమార్ బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. సోమవారం (2023 సెప్టెంబర్ 4న) మధ్యాహ్నం రాజేందర్ స్నానం చేసి టవల్ దండెంపై ఆరేస్తుండగా కూలర్ విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. తండ్రిని రక్షించబోయి కుమారుడు అరుణ్ కూడా మృత్యువాత పడ్డాడు. 
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యులు రోదనలు అందరిని కలచివేశాయి.. కుటుంబ పెద్దతోపాటు చేతికి వచ్చిన కొడుకు అకస్మాత్తుగా మృతిచెందడంతో మృతుల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి.