
పద్మారావునగర్, వెలుగు: తన బిడ్డ పుట్టిన రోజు సందర్భంగా సికింద్రాబాద్అల్ఫా హోటల్‌కు కేక్తీసుకువెళ్దామని వచ్చిన ఓ తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. కేక్బాగా లేదన్నందుకు సదరు హోటల్సిబ్బంది అతడిని ఇష్టమున్నట్టు చికతబాదారు. మార్కెట్ పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. శామీర్ పేటకు చెందిన శేఖర్ పనిమీద సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చాడు. తన బిడ్డ బర్త్‌డే ఉండడంతో కేక్‌కోసం రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న అల్ఫా హోటల్ కు వెళ్లాడు.
కౌంటర్ లో ఉన్న వ్యక్తి కేక్ చూపించగా, ఫ్రెష్‌గా లేదేమిటి ? ఇలాంటివి అమ్ముతారా? అని ప్రశ్నించాడు. దీంతో అక్కడున్న సిబ్బంది ‘ఉన్నది అది కావాలంటే తీస్కపో.. లేకపోతే నోర్మూసుకుని పో’ అని పరుషంగా సమాధానమిచ్చారు. ఏంటలా మాట్లాడుతున్నారని గట్టిగా వాదించగా, 10 మంది సిబ్బంది కలిసి దాడి చేశారు. వారి దాడిలో గాయపడ్డ అతడు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.